వేదన్యూస్ -హెచ్ సీయూ
ఔను మేము గుంటనక్కలమే.. మీలా పంది కొక్కులం కాదు. ఇక్కడ యూనివర్సిటీకి రండి. నెమళ్లు.. జింకలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తాము. ఎక్కడో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడటం కాదు. దమ్ముంటే యూనివర్సిటీకి వచ్చి మాట్లాడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని సవాల్ విసిరారు.
ఆ విద్యార్థిని ఇంకా మాట్లాడుతూ ” ఓ ముఖ్యమంత్రి పదవిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడటం పద్ధతి కాదు.యూనివర్సిటీలోకి జింకలు ఎలా వస్తాయి. ఉన్న ఫళంగా ఎవరూ తీసుకోస్తారు.జల్ జమీన్ జంగల్ మావే. ఇక్కడ ఉన్న ప్రతి పిచుక జింక నెమళ్లను కాపాడాలని అనుకుంటున్నాము. కేవలం రాజకీయ లబ్ధి కోసమే పచ్చని అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు.
ఎంతవరకూ అయిన తెగిస్తాం అని అసెంబ్లీలో ఓ ముఖ్యమంత్రి మాట్లాడటం ఎంతవరకూ న్యాయం.. అటవీ ప్రాంతాన్ని.. అక్కడున్న జంతువులను పక్షులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైన పోరాడుతాం.. ఎక్కడో ఉండి గుంట నక్కలు అని అనడం కాదు దమ్ముంటే మాముందుకు వచ్చి అనాలి. మేము నిజంగానే గుంట నక్కలం కానీ మీలా పందికొక్కులం కాదు అని కౌంటరిచ్చారు.