వేదన్యూస్ – డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం 

ఒకపక్క హైదరాబాద్ గల్లీ నుండి ఢిల్లీ వరకూ ఆ వివాదం పెను సంచలనం సృష్టిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఉస్మానీయా యూనివర్సిటీ వరకూ ఆయా విద్యార్థి సంఘాలు హెచ్ సీయూ వివాదానికి మద్ధతుగా నిలుస్తున్నారు. సినీ ప్రముఖుల దగ్గర నుండి రాజకీయ ప్రముఖుల వరకూ అందరూ అండగా నిలబడుతున్నారు. అఖరికి సొంత పార్టీకి చెందిన నేతలతో పాటు విద్యార్థి సంఘాలు సైతం ఆ వివాదానికి మేమున్నామంటూ ముందుకోస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీకి చెందిన.. అందులో మంత్రులుగా ఉన్న నేతలు ఎంత బాధ్యతగా వ్యవహారించాలి. బర్నింగ్ ఇష్యూ పై మాట్లాడేటప్పుడు ఎంత పద్ధతిగా మాట్లాడాలి . కనీసం ఆలోచనతో మాట్లాడాలి. కానీ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు మాత్రం చాలా తేలిగ్గా.. అసలు అది ఇష్యూనే కాదంటూ తమనోటికి వచ్చినట్లు మాట్లాడారు.

అసలు విషయం ఏంటంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూమి తమదంటూ ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి తీసుకుంది. దీనిపై హెచ్ సీయూ విద్యార్థులు అది తమ యూనివర్సిటీ భూమి. జల్ జంగల్ జమీన్ మాదేనంటూ గత వారం రోజులుగా ధర్నాలు. ఉద్యమాలు చేస్తున్నారు. ఈ అంశం గురించి డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హెచ్ సీయూలో కొంతమంది ఫెయిడ్ బ్యాచ్ ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అది ప్రభుత్వానికి చెందినది. యూనివర్సిటీది కాదు. కొంతమంది విద్యార్థులు ప్రతిపక్షాల మాయలో పడి గొడవ చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు మాయ చేస్తున్నాయి. వారి మాయలో విద్యార్థులు పడ్డారు అంటే బాగుండేదేమో.

కానీ ఉద్యమాలు.. పోరాటాలు చేస్తూ.. పోలీసుల లాఠీ చార్జీ దెబ్బలు తింటున్న.. ఒక పక్క జైళ్లకు సైతం వెళ్తున్న విద్యార్థులను ఫెయిడ్ బ్యాచ్ అనడం ఎంతవరకూ కరెక్ట్ అని ఆయా విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులంటే లెక్క లేదా.. మమ్మల్ని ఫెయిడ్ బ్యాచ్ అంటారా అని ప్రభుత్వంపై .. సదరు మంత్రిపై విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం చల్లారకముందే మరో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఇరవై ఏండ్లు ఖాళీగా ఉంటే చెట్లు పెరగకుండా ఏమి పెరుగుతాయి. చెట్లు పెరిగినంత మాత్రాన అది అడవి అవుతుందా అంటూ విద్యార్థులు జంగిల్ ను నాశనం చేయద్దంటూ చేస్తున్న పోరాటాన్ని హేళన చేసినట్లు మాట్లాడారు. దీనిపై ఇటు మేధావులు, విద్యార్థులు కనీసం అడవులు ఎలా ఏర్పడతాయో కూడా తెలియకండా ఇన్ని సార్లు మంత్రిగా పని చేశారా.. ఎమ్మెల్యేగా గెలుపొందారా.. కనీసం మీరు మంత్రులన్నా సోయి మీకుందా.. లేదా వార్డు మెంబర్లు అనుకుంటున్నారా అని వారు విమర్శిస్తున్నారు.