తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో హామీచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఏమైన చెప్పి హామీ ఇచ్చిందా.. వాళ్లకు తెలియదా రిజర్వేషన్ల అమలు రాష్ట్రాల పరిధిలో ఉండదు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కౌంటరి చ్చారు.
బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటే మమ్మల్ని అడిగి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందా అని బండి సంజయ్ అడుగు తున్నారు. ఇదే మాటను కేంద్ర ప్రభుత్వం తరపున చెప్పించాలి. ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రకటన చేయాలి. రిజ ర్వేషన్ల అమలు మా చేతిలో ఉంటే మేమే అమలు చేస్తాము. బీసీల ద్రోహి బీజేపీ పార్టీ అని ఆయన తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు.