వేదన్యూస్ -కల్వకుర్తి

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్ర జీడీపీ పెంచిండు. మార్పు తెస్తాము. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో గుండాయిజం పెంచిండు అని ఆరోపించారు మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు.

కల్వకుర్తిలో పర్యటిస్తున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బోయిన్ గుట్ట తండాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ” రైతులందరికీ రుణమాఫీ చేశామని నిండు అసెంబ్లీలో ప్రకటించారు. రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డనని చెప్పుకుంటావు.

నల్లమల అడవిలో పెరిగాను అని గప్పాలు కొట్టుకుంటావు. నిజంగా నువ్వు రుణమాఫీ చేసి ఉంటే పోలీసులు లేకుండా.. గన్మెన్స్ లేకుండా బోయిన్ గుట్ట తండా కు రుణమాఫీపై చర్చకు దా. నిజంగా నీకు పౌరుషం ఉంటే నువ్వు పాలమూరు బిడ్డవైతే.. నల్లమల అడవిలో పెరిగితే చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.