వేదన్యూస్ -ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదవాళ్లకు సొంతింటి కలను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన మహోత్తర పథకం ఇందిరమ్మ ఇండ్లు. నియోజకవర్గానికి మూడువేల ఐదు వందల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంలో భాగంగా ఇప్పటికే అర్హులైన వాళ్ల నుండి దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిగ్ అప్ డేట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ రేపు ఆదివారం శ్రీరామనవమి పండుగ తర్వాత రాష్ట్రంలోని ఎంపిక చేయబడిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తామని ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు ఎలాంటి అలసత్వాన్ని ప్రదర్శించకూడదు.
రైతులే మనకు అన్నం పెడుతున్నారు. వాళ్లకు ఎలాంటి నష్టం చేకూరిన దానికి కారణమైన అధికారులపై చర్యలు తప్పవని ఆయన మరోకసారి హెచ్చారించారు. ధాన్యం తరుగు పెడితే సంబంధిత మిల్లర్లపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.