వేదన్యూస్ – డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం. ఇది ఏ శాఖాలోనా అని ఆలోచించకండి. సాక్షాత్తు అత్యంత సీనియర్ మంత్రి.. ముఖ్యమంత్రి స్థాయి నేత నిర్వర్తిస్తోన్న నీటిపారుదల శాఖలో. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి రాముల వారికి పట్టువస్త్రాలతో పాటు తలంబ్రాలు అందించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భద్రాద్రి లో నిర్మితమవుతున్న సీతారామ ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు.
దీనికి సంబంధించిన మౌలిక ఉత్తర్వులను జారీ చేశారు. కానీ అధికారకంగా జీవో జారీ చేయాలి. జీవో జారీ చేయాలంటే సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శి ఆ ఫైల్ పై సంతకం చేయాలి. కానీ శనివారం ఆ అధికారి సచివాలయానికి రాలేదు. అది కూడా సాక్షాత్తు సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయిన ఆ అధికారి హజరు కాలేదు. హాజరు కాకపోవడమే కాదు సారు ఫైల్ పై సంతకం చేయాలని సమాచారం ఇవ్వడానికి ఫోన్ కాల్ చేసిన కానీ అటు నుండి రెస్పాండ్ లేదు.
సమీక్ష సమావేశంలో మంత్రి సీతారామ ప్రాజెక్టు వ్యయ అంచనాల సవరణ ఫైల్ ఏమైంది అని అడిగారు. దీంతో అధికారులంతా ఒకరి ముఖం ఒకరూ చూస్కోవడం సరిపోయింది. అక్కడి పరిస్థితి ఆర్ధం చేసుకున్న మంత్రి ఉత్తమ్ సదరు ఇంటికెళ్లి అయిన సరే ఆ ఫైల్ పై సంతకం చేయించాలి కదా హుకూం జారీ చేశారంట. సాక్షాత్తు మంత్రి చెబితేనే దిక్కు లేదు. ఇక సామాన్యులు అడిగితే అధికారుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఆర్ధం చేసుకోవచ్చు అంటూ విమర్శలు వెలు వడుతున్నాయి.