వేదన్యూస్ – గాంధీభవన్
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో భారతరాష్ట్ర సమితి చీకటి ఒప్పందం చేసుకుంది. అందుకే కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై అవాక్కులు.. చవాక్కులు పేలుస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేందర్ మోదీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనుమతి లేనిదే బండి సంజయ్ కనీసం టిఫెన్ కూడా చేయరని టీపీసీసీ చీఫ్ .. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు.
మహేష్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు తగినంత బలం లేకపోవడంతొనే ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాము. గతంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అమిత్ షా చెప్పులు మోసిన సంగతి మరిచిపోవద్దు అని ఆయన అన్నారు.