తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో గ్రామాల్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆయా రేషన్ డీలర్లు షాకుల షాకులు ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో హాట్టహసంగా రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన సంగతి తెల్సిందే.
పలు నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు.. మంత్రులు ఘనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే రేషన్ డీలర్లు మాత్రం లబ్ధిదారులకు షాకుల షాకులు ఇస్తున్నారు. రేషన్ షాపులను సమయానికి తెరవడం లేదు. తెరిచిన కానీ సన్నబియ్యం స్టాక్ అయిపోయాయి.
రేపు రండి. లేదా ఇప్పట్లో రావు అని చెప్పి రేషన్ కోసం వచ్చిన వాళ్లను తిరిగి వెనక్కి పంపుతున్నారు. దీంతో రేషన్ లబ్ధిదారులు ప్రభుత్వంపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేస్తూ తిట్టుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోవడం వారి వంతవుతుంది. ఎక్కడా చూసిన నోస్టాక్ బోర్డులు కన్పించడంతో చేసేది ఏమి లేక తిట్టుకోవడం జరుగుతుంది. ఇప్పటికైన ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూస్కోవాలని వారు కోరుతున్నారు.