- కొండపాకలో ఘనంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ ప్రోగ్రామ్
- కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడిపెల్లి సతీష్ ఆధ్వర్యంలో ప్రచారం, పాదయాత్ర
వేద న్యూస్, కరీంనగర్:
మహాత్మాగాంధీ వారసత్వాన్ని, అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈదునూరి పైడి కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కొండపాక గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టి వాడవాడల తిరుగుతూ ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ అభియాన్ ప్రతిజ్ఞ బూని వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తూ.. పాదయాత్ర నిర్వహించారు.
పైడి కుమార్ కొండపాక గ్రామంలో అంబేడ్క ర్ విగ్రహానికి పూలమాలవేసి ప్రచారం ప్రారంభించిన తర్వాత మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు.. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ’అనే ప్రోగ్రామ్ చేపట్టినట్టు వివరించారు.
అంబేడ్కర్‌ను బీజేపీ, బీఆర్ఎస్ ఏ విధంగా అవమానిస్తున్నాయో తెలపడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ గొప్పతనం, భారత రాజ్యాంగం ఆవశ్యకత, రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కల్పించిన హక్కులు, విధులు ప్రజలకు వివరించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ వీణవంక మండల అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, మధుకర్ రెడ్డి కంకణాల జగన్ రెడ్డి, నల్ల తిరుపతిరెడ్డి, కొమ్మిడి రాకేష్ రెడ్డి, రఘుపాల్ రెడ్డి, శ్రీనివాస్, సలీం రామకృష్ణ, మసూద్ మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాళ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.