Revanth Reddy Anumula

వేదన్యూస్ – పఠాన్ చెరు

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. కాబోయే ప్రధాన మంత్రి అభ్యర్థి.. లోక్ సభ పక్ష నేత అయిన రాహుల్ గాంధీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా..?. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన బీసీ గర్జను అందుకే రాహుల్ గాంధీ రాలేదా..?. డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లును కలవడానికి ఇష్టపడే రాహుల్ రేవంత్ ను కనీసం దగ్గరకు కూడా రానీవ్వడం లేదా..?. అంటే అవుననే అంటున్నారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు.

బుధవారం పఠాన్ చెరు అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గోన్న  మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకూ నలబై సార్లు ఢిల్లీకి వెళ్లిన కనీసం ఒక్కసారి కూడా వాళ్ల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. కనీసం ఫోటో దిగడానికి కూడా సందు ఇవ్వడం లేదు. అఖరికీ స్పెషల్ ప్లైట్ లో ఢిల్లీకెళ్లి నిర్వహించిన బీసీ గర్జనకు సైతం రాహుల్ గాంధీ రాలేదు.

తెల్లారే డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు… మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చారు.. వారిద్దరితో కల్సి ఆయన ఫోటో దిగారు. తప్పా రేవంత్ రెడ్డిని కనీసం తన ఇంటి గేటును సైతం తాకనీవ్వడం లేదు. పక్కనున్న పీసీసీ చీఫ్ అయిన వైఎస్ షర్మిలకు ఇచ్చిన కనీసం మర్యాద అధికారంలో ఉండి.. సీఎం గా ఉన్న రేవంత్ రెడ్డికి ఇవ్వడం లేదు. మనం చేసే పనులను బట్టే మన నాయకులు విలువ ఇస్తారు అని రేవంత్ రెడ్డిని హెద్దేవా చేశారు.