వేదన్యూస్ – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా యావత్ దేశ రాజకీయాలను సైతం కదిలించిన అంశం హెచ్ సీయూ భూవివాదం. ఎలాంటి అనుమతులు. ముందస్తు సమాచారం లేకుండా అటవీ ప్రాంతానికి.. యూనివర్సిటీకి చెందిన కంచ గచ్చిబౌలిలోని నాలుగు వందల ఎకరాలను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు కట్ట బెడుతుంది. మా భూములు మాక్కావాలని యూనివర్సిటీ విద్యార్థులు కడదాక పోరాడిన సంగతి తెల్సిందే.
చివరికీ సుప్రీం కోర్టు ఆదేశాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. అయితే ఈ భూములను ఐసీఐసీఐ బ్యాంకు తనఖా పెట్టారు. దీని ద్వారా పది వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అప్పు ఇచ్చే బ్యాంకు అసలు ఆ నాలుగోందల ఎకరాలకు అసలు సిసలైన ఓనరు ఎవరూ..?. అసలు ధృవీకరణ పత్రాలు ఉన్నాయా.. ?. లేవా అని చూడలేదు.
కేవల బీజేపీకి చెందిన ఓ ఎంపీ మ్యానేజ్ చేయడం వల్ల యూనివర్సిటీ భూములను తనఖా పెట్టి పది వేల కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆప్తుడు. ఇటీవల మహబూబ్ నగర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో సదరు ఎంపీ పాల్గోన్నారు అని తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఆ ఎంపీ ఎవరూ మున్ముందు తెలియాలి మరి. ఈ వార్తల్లో ఎంతటి నిజముందో మున్ముందు తెలుస్తుంది.