వేదన్యూస్ – వరంగల్
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ” వరంగల్ ఎంకే నాయుడు కన్వేన్షన్ హాల్ లో నిర్వహించే ఈ జాబ్ మేళా లో అరవైకి పైగా కంపెనీలు పాల్గోంటున్నాయి.
ఇందులో పదకొండు వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించబోతున్నాయి అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అని ఆమె ఉద్ఘాటించారు.
ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఏ ప్రభుత్వం కల్పించలేదు. కానీ తమ అర్హతను బట్టి స్థాయిని బట్టి ప్రైవేట్ కోలువులను అందించడానికే ప్రైవేట్ కంపెనీలను .. పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్శిస్తుందని తెలిపారు.