బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి ఓ లేఖ రాశారు. అ లేఖలో హైదరాబాద్ మహానగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచగచ్చిబౌలి లో భూముల్లో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ సీబీఐ లాంటి జాతీయ సంస్థలతో విచారణ చేయించాలి.
పర్యావరణ పరిరక్షణపై అంత చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రధాని మోదీ విచారణకు ఆదేశించాలి. విచారణ చేయించి అవినీతి అక్రమాలపై నిజానిజాలను తేల్చి బీజేపీ కాంగ్రెస్ కు మధ్య ఎలాంటి సంబంధం లేదు అని నిరూపించుకోవాలి. పదివేల కోట్ల రూపాయలను ప్రభుత్వ భూములను పెట్టి ఎలా అప్పుగా తీసుకుంటారు.
ముఖ్యమంత్రి.. ప్రభుత్వం ఆ భూములకు ధర్మకర్తలే తప్పా ఓనర్లు కాదు అన్న సంగతి తెల్వదా.. ప్రధానమంత్రి నరేందర్ మోదీ పర్యావరణం గురించి.. అటవీ భూముల గురించి ప్రసంగాలు కాదు ప్రజలకు నిజాలు తెలిసేలా కంచగచ్చిబౌలి భూములపై విచారణ చేయించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.