Revanth Reddy AnumulaRevanth Reddy Anumula

వేదన్యూస్ – జపాన్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను హేయమైన చర్యగా  ఆయన ఈసందర్భంగా  అభివర్ణించారు.”ఇటువంటి కిరాతక చర్యలు భారత ప్రజల సమైక్యతను, ధైర్యాన్ని ఎన్నటికీ దెబ్బతీయలేవు” అని స్పష్టం చేశారు.

ఈ దాడికి బాధ్యత వహిస్తున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ సందర్భంగా దేశ ప్రజల ఐక్యతకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటు నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రగాఢ సంతాపం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *