వేద న్యూస్, ఎలిగేడు:
కేసిఆర్ పై ఉన్న అభిమానాన్ని బతుకమ్మ రూపంలో చాటుకున్నారు శ్రీనివాస్ రెడ్డి . పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామ వాస్తవ్యులు కళ్లెం శ్రీనివాసరెడ్డి కెసిఆర్ పై ఉన్న మమకారాన్ని బతుకమ్మ రూపంలో వ్యక్త పరిచారు.
సద్దుల బతుకమ్మ సందర్భంగా కేసీఆర్ అనే అక్షరాలు ఆంగ్లంలో కనబడే విధంగా పేర్చిన ఈ బతుకమ్మ అందరూ దృష్టిని ఆకర్షిస్తున్నది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రతీ ఇంటికి సంక్షేమం అందిస్తున్న ఘనత బీఆర్ఎస్ సర్కార్ దేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మనోహర్ రెడ్డి దాసరి, కెసిఆర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.