వేద న్యూస్, వరంగల్:
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ) – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ వారు నిరుద్యోగ యువతులకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి 35 రోజుల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ బాస రవి తెలిపారు. ఇందుకు అభ్యర్థులు వరంగల్ రూరల్, హనుమకొండ ,జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు మహబూబాబాద్ జిల్లాల వారై ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు దీనికి అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
క్యాండిడేట్స్ వయోపరిమితి 18-45 ఏండ్లు ఉండాలని, తెలుగు లో చదవటం, రాయటం వచ్చి ఉండాలని, చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు అర్హులు కాదని, తెలుపు రేషన్ కార్డ్ కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు 4 పాస్స్ పోర్ట్ సైజు ఫొటోలు, రేషన్ కార్డ్, ఆధార్ కార్దు, విద్యార్హత జిరాక్స్ కాపీలను తీసుకోని భారతీయ స్టేట్ బ్యాంకు – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (SBI RSETI)సంస్కృతి విహార్ టీటీడీసీ, హసన్పర్తి, వరంగల్ జిల్లా – 506 371, అడ్రస్ లో వచ్చే నెల 7 లోగా పేర్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.
శిక్షణ కార్యక్రమం వచ్చే నెల 7 నుంచి ప్రారంభం కానుందని, శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామని, కోర్సుకు సంబంధించిన మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు యోగ్యతా పత్రం (సర్టిఫికేట్) ఇవ్వనున్నట్టు వెల్లడించారు. మరిన్ని వివరాలకు, 97040 56522 , 9849307873, 6281260878,9949108934 నంబర్లలో సంప్రదించొచ్చని స్పష్టం చేశారు. ఈ కోర్సులో జాయిన్ అయ్యేందుకు మున్సిపల్ నివాస ప్రాంత అభ్యర్థులు అనర్హులని పేర్కొన్నారు.
