వేద న్యూస్, జమ్మికుంట:
ఈ నెల 6న(ఆదివారం) జమ్మికుంట పట్టణంలోని కొండూరి కాంప్లెక్స్ వద్ద ఉన్న అమ్మ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో మెగా గుండె క్యాంపు నిర్వహించనున్నట్టు ఆ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ భగీరత్ అత్తె ఎండీ, డీఎం.. ఈ క్యాంప్‌నకు హాజరుకానున్నారు. ప్రతి ఆదివారం సదరు వైద్యులు అందుబాటులో ఉంటారని, పిల్లలు, పెద్దలకు తగు వైద్యం అందించనున్నారని వెల్లడించారు.