వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ప్రెస్ భవన్ లో ‘ఆటో బతుకులు’ సీరియల్ యూనిట్ సభ్యులను టి జి పి ఏ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్(ప్రభు) గురువారం సత్కరించారు. టి జి పి ఏ ఉమ్మడి కరీంనగర్ కార్యాలయంలో డైరెక్టర్ నగునూరి విజయకుమార్, హీరో ఆటో రవికుమార్, టి జి పి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ర్ట నిజ నిర్ధారణ కమిటి కన్వీనర్, చిత్ర నటులు దార మధు ను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా అంబాల ప్రభు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించి ప్రజలకు, ప్రభుత్వాల దృష్టికి తీసుక వెళ్లి వారిని ఆదుకునే విధంగా సీరియల్ నీ తీశారని కొనియాడారు. భవిష్యత్ లో గొప్ప స్థాయిలో ఎదగాలని, సమాజానికి ఉపయోగడే సీరియల్స్ తీయాలని కోరారు.
కార్యక్రమంలో చిత్ర నటి నటులు కాంపల్లి శ్రీనివాస్, మాతంగి శివకుమార్, అనుముల కళావతి, మాతంగి లక్ష్మణ్,కాశిపేట రాజయ్య,కన్నం లక్ష్మణ్,టి జి పి ఏ రాష్ర్ట సెక్యూరిటి పోర్స్ కన్వీనర్
డి ఎస్ నందం,సెక్యూరిటి పోర్స్ సభ్యులు అనిల్ పాల్గొన్నారు.