వేదన్యూస్ – నందిగామ
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేతిలో ఆ పార్టీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావుకు ఘోర అవమానం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా నందిగామ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా బాబు హెలిప్యాడ్ వద్దకు చేరుకోగానే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎంపీలు.. స్థానిక నేతలు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి.. శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు అందర్నీ పేరుపేరున పలకరిస్తూ అందరికి కృతజ్ఞతలు చెబుతూ వారి చెప్పింది వినుకుంటూ ముందుకు సాగారు.
ఇక్కడి వరకూ బాగానే ఉంది. జిల్లాకు చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కొలికపూడి శ్రీనివాసరావు చంద్రబాబును ప్రసన్నం చేసుకోవాలని శతధా ప్రయత్నించాడు. హెలికాప్టర్ దిగిన దగ్గర నుండి కారు ఎక్కేవరకూ చివరి క్షణం దాక పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నం చేశాడు. సెంటీమీటర్ల దూరంలో ఉండి.. కళ్లకు ఎదురుగా కన్పించిన .. అఖరికీ శ్రీనివాస రావు నమస్కారం సారు అంటూ రెండు చేతులెత్తి దండం పెడుతున్న బాబు చూసి పట్టించుకోకుండా ఆయన పక్కనున్న నేతలను పలకరిస్తూ వాళ్ల భుజాలపై చేతులేశాడు తప్పా శ్రీనివాస రావు అసలు ఎవరూ కూడా తెలియనట్లు ముందుకెళ్లాడు.
దీంతో ఆయన అభిమానులు, దళిత సంఘాలు విరుచుకుపడుతున్నారు. ఓ దళిత ఎమ్మెల్యేను కావాలనే బాబు అవమానిస్తున్నారు. ఆయన చెడ్డవాడా.. మంచివాడా అనేది పక్కనెడితే ఎదురుగా ఉన్నప్పుడు పలకరిస్తే పలకరించడం మినిమమ్ మర్యాద. ఇది తెలియని నలబై ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం ఎందుకు. దళితులను ఎందుకు అవమానిస్తున్నారని వారు విమర్శలు చేస్తున్నారు. ఆది నుండి ఎమ్మెల్యే కొలికపూడి పలుమార్లు వివాదాల్లో చిక్కుకోవడం మనం చూస్తూనే ఉన్నాము.