- రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆఫీసర్ల క్షేత్రస్థాయి పరిశీలన
వేద న్యూస్,బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఆదేశాల మేరకు సిరిసిల్ల నుండి కరీంనగర్ కు వెళ్లే దారిలో వేములవాడ మండలం నాంపెల్లి కూడలి రుద్రవరం బోయినిపల్లి మండలం ఆరేపెల్లి, కొదురుపాక, కూడలి ఆరేపెల్లి వంతెన వెంకట్రావు పల్లె వరకు ప్రమాదాలు సంభవించే రోడ్డును అధికారులు గురువారం తనిఖీ చేశారు.

యాక్సిడెంట్స్ జరిగే రోడ్డుపైన రంబుల్ స్ట్రిప్, స్టడ్స్ లైట్స్, సోలార్ లైట్లు , హజార్డ్ మార్కర్స్ వేగనియంత్రణ కోసం అమర్చుటకు స్థలాలను ఎంపిక చేశారు.
ఇందులో జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్, మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్, జిల్లా రవాణా శాఖ సభ్యులు సంగీతం శ్రీనాథ్, ట్రాఫిక్ సబ్ ఇన్ స్పె క్టర్ రాజు,సిరిసిల్ల వేములవాడ రహదారి భవనాల అధికారులు డిప్యూటీ ఇంజనీరు శాంతయ్య, వరప్రసాద్ ఏ ఈ ఈ నవ్య, అలాగే సిబ్బంది పాల్గొన్నారు.