వేద న్యూస్, వరంగల్ క్రైమ్: 

 

మార్చి 17 నుంచి 22వ తేది వరకు హైదరాబాద్‌లోని పుల్లెల గొపిచంద్‌ అకాడమీలో నిర్వహించిన 16వ ఆలిండియా పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో ఏసీపీ యం.జితేందర్‌ రెడ్డి కాంస్య పతకాన్ని సాధించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న జితేందర్‌ రెడ్డి జాతీయ స్థాయి బాడ్మింటన్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ విభాగం తరుపున పాల్గోని 55 సంవత్సరాల విభాగంలో బాడ్మింటన్‌ డబుల్స్‌ పోటీలో అడిషినల్‌ ఎస్పీ వెంకట్రావ్‌తో కల్సి అడి కాంస్య పతకాన్ని సాధించారు. ఏసీపీ జితేందర్‌ గతంలోను జాతీయ స్థాయిలో నిర్వహించిన పోలీస్‌ బాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిఫ్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించడంతో పాటు పలు అంతర్జాతీయ బ్యాడిరటన్‌ పోటీల్లో పతకాలను సాధించారు. ఈ సందర్బంగా వరంగల్‌ పోలీస్ కమిషనర్ అంబర్‌ కిషోర్‌ ఝా ఏసీపీ జితేందర్‌ను పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఏసీపీ జితేందర్‌ రెడ్డి పోలీస్‌ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్నారని తెలియజేసారు.