- డీఎంహెచ్ఓ, ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
వేద న్యూస్, హన్మకొండ :
బంధన్ హాస్పిటల్ పై గత కొద్ది రోజులుగా బాధితుడు జర్నలిస్టు కృష్ణ చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి సోమవారం హన్మకొండ జిల్లా డీఎంహెచ్ఓ అప్పయ్యకు, ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా దళితరత్న నమిండ్ల చిన్నస్వామి మాట్లాడుతూ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల జర్నలిస్టు కృష్ణ ప్రాణాపాయ స్థితికి వెళ్లి 3 నెలలు మంచానికి పరిమితం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది 21 జూలైన చేసిన అపెండిక్స్ ఆపరేషన్ వికటించిన విషయం చెప్పకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే జర్నలిస్టు కృష్ణకు ఆ పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ ఘటన పై జిల్లా ఉన్నత అధికారులు స్పందించి విచారణ జరిపి బాధితుడికి న్యాయం చేయాలని వరంగల్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి డిమాండ్ చేశారు.