• జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి

వేద న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం :

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నిర్వహించబోయే పర్సనల్ ఆఫీసర్, ఇతర ఆఫీసర్ స్థాయి ఉద్యోగ నోటిఫికేషన్ లో పరీక్షలకు సిద్ధపడుతున్న అభ్యర్థుల వయోపరిమితిని పెంచాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి కోరారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

సింగరేణి ఉద్యోగాల కోసం అందులో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థుల గరిష్ట వయెపరిమితిని 40 సంవత్సరాలకు పెంచి..వారు అప్లై చేసుకునే విధంగా తోడ్పడాలన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల పక్షాన ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ సీఎండీని కోరుతున్నట్లు పేర్కొన్నారు.