వేద న్యూస్,ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకొని ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ కె.దేవరాజం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హెచ్ఐవి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మానవులకు హెచ్ఐవి రావడానికి గల కారణాలు దాని నివారణ చర్యలు, చికిత్స విధానం గురించి వివరించడం జరిగింది. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలైన మహారాష్ట్ర,తమిళనాడు ,కర్ణాటక ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ, వంటి రాష్ట్రాలలో హెచ్ఐవి వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లుగా తెలిపారు.హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క ప్రభావం సమాజంపై ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని అందులో రాబోయే భారత పౌరులుగా నేటి సమాజంలోని విద్యార్థుల పాత్ర అనే అంశాలను చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి బి .కుమారస్వామి, కె .లింగమూర్తి, పొలిటికల్ సైన్స్ లెక్చరర్ జె.విజయ్, కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.