వేద న్యూస్,కరీంనగర్:

కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన రూ.4.50 కోట్ల అవినీతి, అక్రమాలపై విచారణ జరిగి 20 రోజులు అవుతున్నా కారకులైన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని, అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు ఏఐ ఎఫ్ బి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. వారికి ట్విట్టర్, వాట్సాప్,వారి కార్యాలయాలకు పోస్టు ద్వారా లేఖలు పంపించినట్లు తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే తలమానికమైన ప్రభుత్వ ఆసుపత్రిలో నాలుగున్నర కోట్ల కుంభకోణం జరిగితే ఇప్పటి వరకు మంత్రులు పట్టించుకోకపోవడం శోచనీయమని తెలిపారు. పెద ప్రజలు ఉపయోగించుకునే ఆసుపత్రిలో అవినీతి జరిగిన పట్టించుకోరా అని ప్రశ్నించారు. అవినీతి డాక్టర్ లను కాపాడేందుకు పెద్ద ఎత్తున లభింగ్ చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వలకు చెందిన రూ.4,50,00,000దుర్వినియోగం చేయడం వంటి కుంభకోణంలో పాల్గొన్న డాక్టర్ కృష్ణ ప్రసాద్, డాక్టర్ అజయ్ ప్రసాద్, డాక్టర్ నవీన, డాక్టర్ మొహమ్మద్ అలీమ్, డాక్టర్ రత్నమాల, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ జ్యోతి పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. ఎంక్వైరీ చేసిన రిపోర్టును మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి
రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అధికారులు, జిల్లా డీఎంహెచ్వో, ఇతర అధికారులు పూర్తిస్థాయిలో రూ.4.50 కోట్ల అవినీతిపై ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి 20 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క డాక్టర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపావడం ఏమోటాని ప్రశ్నించారు. 4.50 కోట్ల కుంభకోణం జరగలేదా ఏదో ఒక్కటి ఎంక్వైరీ రిపోర్టును బహిర్గతపర్చాలని డిమాండ్ చేశారు. అలాగే అవినీతి అధికారులు, వైద్యులను సస్పెండ్ చేయాలని, అవినీతికి పాల్పడ్డ నిధులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.