వేదన్యూస్ – మంగళగిరి
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ నాయుడు మాట్లాడుతూ రెడ్ బుక్ తీస్తామని అనగానే కొంతమంది బాత్రూం లో జారిపడ్డారు. మరికొంతమంది హార్ట్ అటాక్ అంటూ రాష్ట్రాలనే దాటిపోయారని వ్యాఖ్యానించారు.
మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ ” మంత్రి నారా లోకేష్ నాయుడు తన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి. రాజకీయాల్లో విమర్శలు చేయాలి . కానీ వ్యక్తిగత అంశాలపై కూడా ముందు వెనక లేకుండా మాట్లాడటం హేతుబద్ధం కాదు. మా నేతలు ఎమ్మెల్యేలు.. మంత్రులైనప్పుడు లోకేష్ కనీసం వార్డు మెంబర్ కూడా కాలేదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు.
నిన్నటిదాక మేము అధికారంలో ఉన్నాము. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు. రేపు మీరు అధికారంలో ఉంటారో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. అధికార మదంతో విర్రవీగినవాళ్లకు ప్రజలు కర్రుగా కాల్చి వాత పెట్టిన సంగతి మరిచిపోవద్దు. అక్రమ కేసులతో అరెస్ట్ లు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అని ఆయన అన్నారు.