వేద న్యూస్, వరంగల్ టౌన్ :

సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ అని తెలంగాణ రమాబాయి ఉమెన్స్ పెడరేషన్ అధ్యక్షురాలు తరాల రాజమణి కొనియాడారు. భారత రాజ్యంగ నిర్మాత భారతరత్న, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి తెలంగాణ రమాబాయి ఉమెన్స్ పెడరేషన్ అధ్యక్షురాలు తరాల రాజమణి
పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కరీమాబాద్ అంబేద్కర్ నగర్ ప్రాంతంలోని వార్డ్ మహిళలకు, పిల్లలకు అరటి పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రమాబాయి ఉమెన్స్ పెడరేషన్ అధ్యక్షురాలు తరాల రాజమణి మాట్లాడుతూ హక్కుల కంటే బాధ్యతలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే బాబా సాహెబ్ అంబేడ్కర్ కు నిజమైన నివాళిగా వారు పేర్కొన్నారు. అంబేద్కర్ వల్లే నేడు స్త్రీ పురుషులకు సమాన హక్కులు వచ్చాయన్నారు. ఆడవారు వంటి ఇంటి కి పరిమితం కాకుండా మహిళలు అని రంగాల్లో రాణించాలని దానికి చదువు తప్పని సరి అని బోధించు.. సమీకరించి..పోరాడు అనే విధంగా ప్రతి ఒక మహిళ కూడా అన్ని రంగాలలో పురుషులకు సమానంగా ఉన్నారు. ఆ మహనీయుడి వర్ధంతి, జయంతి ఇంకా పెద్ద ఎత్తున్న వాడ వాడల ప్రతి ఒకరు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మహిళలు ఎరుకల కళావతి,నాగమణి,నవనీత,స్వరూప,రజిత,రాధిక,సంగీత,చంద్రకళ,నదియా, రవి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.