వేద న్యూస్, జమ్మికుంట:
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులలో చేరబోయే విద్యార్థులు ఈ నెల 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ వర్సిటీ అడ్మిషన్లకు సంబంధించిన వివిధ వాల్ పోస్టర్లను జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ అధ్యయన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కే.రాజేంద్రం సమక్షంలో కళాశాల సిబ్బంది గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లడూతూ.. అంబేద్కర్ ఓపెన్ వర్సిలో విద్యార్థుల సౌకర్యంకోసం ‘సమత-నిపుణ’,” “వి”హబ్ వంటి పథకాలను సర్కారు ప్రవేశ పెట్టిందని, పథకాలతో స్టూడెంట్స్ కు ఉద్యోగావ కాశాలు పుష్కలంగా లభిస్తాయని ఆకాంక్షిచారు.
అంబేంద్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ చేసే నిద్వార్థులు ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఓదెలు కుమార్ సూచించారు.
అనంతరం కళాశాల అంబేద్కర్ అధ్యయన కేంద్రం కో-ఆర్డినేటర్ డాక్టర్ కే. రాజేంద్రం మాట్లా డుతూ ..”లెర్నింగ్ బై డూయింగ్” ద్వారా విద్యార్థులకు చదువుతూ పని చేసుకునే అవకాశం కల్పించబడిందని చెప్పారు. వయోజనులైన విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కే.గణేశ్, కరణ్ కుమార్, డా.ఎం. శ్యామల, రాజాకుమర్, శ్రీనివాసరెడ్డి, రవిప్రకాశ్, రమేష్, సుధాకర్ బోధన, బోధనేతర తదితర సిబ్దంది పాల్గొన్నారు.