వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వరంగల్ పోలీస్ కమిషనర్ గా అంబర్ కిశోర్ ఝా నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అంబర్ కిశోర్ ఝా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓఎస్డీగా విధులు నిర్వహించారు. కాగా, నిన్నటి వరకు వరంగల్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వహించిన ఏవీ రంగనాథ్ ను హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.