వేద న్యూస్, సినిమా:

బాలీవుడ్ బిగ్ బీ, యాంగ్రీ యంగ్ మ్యాన్ గా పేరు గాంచిన సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలో ఎంతో మంది నటీనటులకు అమితాబ్ బచ్చన్ స్ఫూర్తిప్రదాత. కాగా, సీనియర్ నటుడిగా ఉన్న ఆయన తనను తను ప్రతి సినిమాలో ఆవిష్కరించుకునే విధానం చూసి సినీ నటులే కాదు ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోతుంటారు. 

అమితా బ్ బచ్చన్  తెలుగులో నటించిన సినిమాల్లో ఒకటి ప్రభాస్ ‘కల్కి’ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. కాగా, అదే బచ్చన్ తొలి తెలుగు ఫిల్మ్ కాదండోయ్.. ఆయన (అమితాబ్ బచ్చన్) తెలుగులో అంతకుముందే కొన్ని చిత్రాల్లో నటించారు. 1995లో కృష్ణవంశీ ‘గులాబీ’ చిత్రంలో కేమియో రోల్ ప్లే చేసిన బచ్చన్.. ఆ తర్వా త అక్కినేని నాగార్జున ‘మనం’ చిత్రంలో కేమియో చేశారు. 

అనంతరం మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ ఫిల్మ్ లో కీలక పాత్రను బచ్చన్ పోషించారు. గోసాయి వెంకన్నగా అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర సినిమాలో కీలకంగా నిలిచింది. అలా అమితాబ్ బచ్చన్ ‘కల్కి’కి ముందే పలు చిత్రాల్లో నటించడం విశేషం.