వేదన్యూస్ – ఫిల్మ్ నగర్
ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి వారసురాలితో బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్ళి జరుగుతుందని కొందరూ ప్రచారం చేశారు. లేదు ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూతురితో వివాహాం జరుగుతుందని మరికొంత మంది ప్రచారం చేశారు.
లేదు ఇండియన్ క్రికెట్ జట్టు మహిళా కు చెందిన ఓ ప్లేయర్ తో ప్రేమాయణం జరుపుతున్నాడని పుకార్లు పుట్టించారు. తన పెళ్ళి గురించి వస్తున్న వార్తలపై యాంకర్ ప్రదీప్ తాజాగా స్పందించారు. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు.
నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. వాటిని నేను సాధించాక పెళ్లి చేసుకుంటాను. ఆ పెళ్ళి కూడా మీకు చెప్పే చేస్కుంటాను. నేను పెట్టుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి నా పెళ్ళి కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుందని యాంకర్ ప్రదీప్ సెలవిచ్చారు.