వేద న్యూస్, చొప్పదండి:
రామడుగు మండలంలోని లక్ష్మిపూర్ గ్రామ అంగన్ వాడీ టీచర్ గడ్డం సరోజన భర్త గడ్డం శ్రీనివాస్ పరమపదించినందున వారి కుటుంబాన్ని గోపాల్రావుపేట్ తాజా మాజి సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి పరామర్శించారు.
ఇట్టి కార్యక్రమంలో కొల్లూరి భూమయ్య డీలర్, గ్రామ శాఖ అధ్యక్షులు గాదె మహేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనారాయణ, మిరియాల సంజయ్, తాజా మాజి ఉపసర్పంచ్ ముచ్చంతల నరేందర్ రెడ్డి, గుడిసెల లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.