- కాద్లూర్ అంగన్ వాడీ సెంటర్లో టీచర్దే రాజ్యం
- పిల్లలు, గర్భిణులకు ఇచ్చే గుడ్లు ,నిత్యవసరాలు అమ్మకం
- పట్టించుకోని అధికారులు
వేద న్యూస్, టేక్మాల్:
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల పరిధిలోని కాద్లూ ర్ గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రం టీచర్.. సరుకులను మార్కెట్కు ఆటోలో తరలిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పిల్లలు, గర్భిణులకు ఇచ్చే గుడ్లు ఇతర నిత్యావసరాలను ఇతరులకు అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు. అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే టీచర్ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ హెమ భార్గవిని ఈ విషయమై వివరణ కోరగా, సమగ్ర విచారణ జరిపి రుజువైతె శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలి పారు.