వేద న్యూస్, వరంగల్ టౌన్:
అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని గోనె రాంప్రసాద్ అన్నారు. గణేశ్ నవరాత్రులలో భాగంగా గురువారం కరీమాబాద్ ప్రాంతంలో శ్రీ వినాయక సంఘం వారు ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద గోనె రాంప్రసాద్, మిట్టపల్లి భాస్కర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదానం చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.