• అన్నదానం మహాదానం

 వేద న్యూస్,వరంగల్: 

 గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని ఆటో నగర్ లోని బాల గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాతలు ముద్దు రాజు-శారదా కుటుంబం సభ్యులు అన్నదానం నిర్వహించారు.

అన్ని దానాలలోకెల్లా అన్నదానం మహాదానమని, భగవంతుడి సన్నిధిలో అన్న ప్రసాద స్వీకరణ ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుందని అన్నదాతలు వెల్లడించారు. లంబోధరుడు, ఏకదంతుడు, తొలి పూజలు అందుకునే భగవంతుడు బొజ్జ గణపయ్యను.. అందరికీ సిద్ధి, బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలో హాయిగా భగవంతుడిని తలుచుకోవడం, గణనాథుడి స్మరణలో సమయం గడపడం చక్కటి విషయమేనని భక్తులు పేర్కొన్నారు.

కార్యక్రమంలో బాల గణపతి యూత్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.