వేద న్యూస్, వరంగల్:
ఈ నెల 22న(గురువారం) హనుమాన్ జయంతి సందర్భంగా హనుమకొండ జిల్లా దామెర మండలం పరిధి లోని పులుకుర్తి గ్రామంలో అన్నదానం ఏర్పాటు చేయనున్నట్టు హనుమాన్ దీక్ష మాల ధారి పెంచల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామ శివారులో ని హనుమాన్ టెంపుల్ వద్ద..ఈ అన్నదానం ప్రోగ్రాం ఉండనుంది.
భక్తులు, ప్రజలు, ఆంజనేయ స్వామి దీక్ష మాల దారులు .. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై, అన్న ప్రసాదం స్వీకరించి… కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.