- మహా అన్నదానానికి అధిక సంఖ్యలో హాజరైన భక్తులు
వేద న్యూస్, కరీమాబాద్:
అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని శ్రీ నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని కరీమాబాద్ రామస్వామి గుడి వీధిలో ఏర్పాటు చేసిన గణనాథుడికి నిత్యం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
గురువారం శ్రీ నవ యువ చైతన్య యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పలువురు దాతల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కాగా సుమారు 1500 మందికి అన్నదానం చేయడం విశేషం.