AP Minister Satya Kumar YadavAP Minister Satya Kumar Yadav

వేదన్యూస్ – ఆంధ్రప్రదేశ్ 

ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్ యూనివర్సిటీలో ఏపీ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణస్వీకారం  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ” ఈరోజుల్లో వైద్యం కూడా కార్పోరేట్ అయిపోయింది.

వైద్యమంటేనే వ్యాపారం అనుకునేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. చిన్న జబ్బు చేసిన కానీ స్కానింగ్ లు.. ఎక్స్ రేలు.. పరీక్షలు రాస్తున్నారు. గతంలో జ్వరమోస్తే ఫారాసిటమాల్ ఇచ్చేవారు .కానీ నేడు దానికి కూడా పెద్ద పెద్ద స్కానింగ్ లు రాస్తున్నారు.

ఒకప్పుడు జలుబు చేస్తే టాబ్లెట్లు వేసుకుంటే వారంలో తగ్గుతుంది. వేసుకోకపోతే వారంలో తగ్గుతుంది అనే నానుడి ఉంది. అఖరికి జలుబు చేసిన కానీ కొంతమంది వైద్యులు దానికి వేల వేల రూపాయల పరీక్షలు రాస్తున్నారు. ఈరోజుల్లో వైద్యాన్ని సైతం వ్యాపారం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.