వేద న్యూస్, హన్మకొండ:
వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ని హనుమకొండ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా పక్షాన నాయకులు శనివారం మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆరె కులస్థులతో తనకు అనుబంధం ఉందని, వారి జీవన స్థితి గతులపైన తనకు అవగాహన ఉందని తెలిపారు. ఆరె కులస్తుల అభివృద్ధికి, వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు.

అనంతరం ఎన్జీవోఎస్ రోడ్ తన నివాసంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ని సైతం ఆరె సంఘం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ తన నియోజక వర్గ పరిధిలో ఏ అవసరమున్నా తనను సంప్రదించొచ్చని, సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో ఆరె సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే శివాజీ, ప్రధాన కార్యదర్శి వజ్ర కిషన్ రావు, కమిటీ సభ్యులు కొల్లూరి కండేరావు, పేర్వాల లింగమూర్తి, వాడికారి బాబురావు, కరాబు రాజేశ్వర్ రావు, లోనే దీపక్ జి, గురుజాల నిరంజన్ రావు, హింగే భాస్కర్, తుమ్మనపల్లి శ్రీనివాస్, అవేలి శ్రీనివాస్, సిందే శ్రీనివాస్ హనుమకొండ మండల అధ్యక్షుడు అడగాని శివాజీ, ప్రధాన కార్యదర్శి శ్యాంరావు, వాడికారి రాజు, దౌతుబాజి అంజాజి తదితరులు పాల్గొన్నారు.