వేద న్యూస్, జమ్మికుంట:
కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాదయాత్ర చేస్తోన్న సంగతి అందరికీ విదితమే. ఆ యాత్రలో భాగంగా ఆయన హుజురాబాద్ అసెంబ్లీ పరిధిలో ఈ నెల 29న యాత్ర చేయనున్నారు. జమ్మికుంట మండలంలోని వావిలాలలో యాత్ర ఏర్పాట్లను బీజేపీ మండలాధ్యక్షుడు సభ్యులు సంపత్ రావు, మండల ఇన్ చార్జి పుప్పల రఘు, ప్రజాహిత యాత్ర రూట్ ప్రముఖ్ ఆకుల రాజేందర్, నాయకులు వీరగోని రాజన్న, పొన్నం తిరుపతి, ఆకుల రమేష్, పుల్లూరు ఈశ్వర్ కంకణాల స్వరూప రాణి, అనుకూరి రమణారెడ్డి, మైన కంటి వెంకటరెడ్డి , తుడి గణేష్, రంజిత్ తదితరులు పూర్తి చేశారు.
‘ప్రజాహిత యాత్ర’ రూట్, భోజన ఏర్పాట్ల పనులను బుధవారం పరిశీలించారు. ‘ ప్రజాహిత యాత్ర’లో పాల్గొని యాత్రను సక్సెస్ చేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బండి సంజయ్ అభిమానులు, ప్రజలను నాయకులు కోరారు.