వేద న్యూస్, హనుమకొండ: 

 

కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన ‘ఓరుగల్లు ఘన కళా వైభవం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

దాదాపు 100కు పైగా పాటలు, ఐదు గంటల పాటు సాగిన గానామృత యజ్ఞంలో కళాకారులు సమాజ హితాన్ని కోరుతూ స్ఫూర్తిదాయకంగా ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో పాట ఉద్యమానికి ఊపునిచ్చిన ఘనత పాటకే చెందిందని పేర్కొన్నారు. కవులు, కళాకారులు సమాజంలో మార్పు తేవగల శక్తి కలవారని గుర్తుచేశారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వత తక్కువ కాలంలోనే కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించి కవులకు, కళాకారులకు అంకితం చేశామని తెలిపారు.

అదేవిధంగా, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.

ఈ అవగాహన కార్యక్రమాన్ని కళాకారులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోడ డిన్న, కళాకారులు అనిల్ తదితరులు పాల్గొన్నారు.