వేద న్యూస్, జమ్మికుంట:
శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం జమ్మికుంట లో సప్తశక్తి సంగం ” ( మాతృ సమ్మేళనం ) ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత కార్యదర్శి శ్రీమతి అనఘా వేంకటలక్ష్మి పాల్గొని భారతదేశ ఉన్నతిలో మహిళల పాత్ర గురించి వివరించారు పిల్లలను సంస్కారవంతులుగా తీర్చి దిద్దుటలో తల్లుల పాత్ర ప్రధానము అన్నారు.
మరో వక్త అలివేలు మంగ మాట్లాడుతూ.. కుటుంబ ప్రబోధన్ లోపోషకులను ఉద్దేశించి ఉమ్మడి కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో స్త్రీ పాత్ర ఎలా ఉండాలి? సమాజంలో మార్పు రావాలంటే స్త్రీలు ఎలా ఉండాలి? అన్నింటికీ మూలాధారమే స్త్రీ అని చెప్పారు.
మొదటగా స్త్రీలు ఆదర్శంగా ఉంటే మంచి సమాజం నిర్మాణం అవుతుందనీ ,. స్త్రీలలో ఉన్న సప్తశక్తుల గురించి వివరించారు.
మన పర్యావరణాన్ని మనము పరిరక్షించుకోవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు 225 మంది, మాతాజీలు 10 మంది మొత్తం 235మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరినగర్ విభాగ్ శైక్షనిక్ ప్రముఖ్ కాటం రవీందర్ , లెక్కల రమాదేవి, వేషాల సుకన్య పాల్గొన్నారు.