- స్టూడెంట్స్‌కు పాఠశాల సమితి అధ్యక్షుడు, ఆచార్యుల అభినందన
వేద న్యూస్, జమ్మికుంట:
విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌కు అనుబంధంగా నడుస్తున్న సరస్వతి విద్యాపీఠం తెలంగాణ నిర్వహిస్తున్న ఖేల్‌కూద్ పోటీలలో భాగంగా ఆదిలాబాద్ శిశు మందిర్ పాఠశాలలో ఈ నెల 10,11,12 తేదీల్లో ప్రాంత స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం జమ్మికుంట నుంచి 18 మంది విద్యార్థులు పాల్గొని సత్తా చాటారు.
ఈ పోటీలలో విద్యార్థులు వివిధ ఈవెంట్స్‌లలో ప్రథమ-20 , ద్వితీయ-9, తృతీయ-10 బహుమతులు సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రార్థన సమయంలో పాఠశాల సమితి అధ్యక్షులు చెట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ దొరస్వామి నాయక్, పాఠశాల ప్రధానాచార్యులు పొలసాని సుధాకర్‌రావు, ఆచార్యులు విద్యార్థులను అభినందించారు.
ఈ నెల 5, 6 తేదీలలో జరిగిన దక్షిణ మధ్య క్షేత్ర-కర్ణాటక చెస్ గేమ్స్‌లోనూ పాల్గొని కాంస్య పతకాలు సాధించిన విద్యార్థులను కూడా ప్రశంసించారు.