వేద న్యూస్, వరంగల్ టౌన్ :
రోడ్డు భద్రత అవగాహనపై నెహ్రూ యువ కేంద్ర వరంగల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలపై యువతకు ప్రత్యక్ష అవగాహన కల్పించడంలో భాగంగా ట్రాఫిక్ సిబ్బందితో శిక్షణ నిర్వహించడంతో పాటుగా సందేహాల నివృత్తి చేపట్టారు. ఈనెల 11 నుంచి 17 వరకు నిర్వహిస్తున్న నేషనల్ యూత్ వీక్ లో భాగంగా రహదారి భద్రత అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
మొదటిరోజు కార్యక్రమంలో భాగంగా లక్నేపల్లిలోని బాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ సైన్స్ (బిట్స్), ఉర్సుగుట్టలోని తాళ్ల పద్మావతి ఫార్మసి కాలేజీలలో వర్క్ షాప్ నిర్వహించారు. రోడ్డు భద్రత అనేది ప్రభుత్వ విధానంగా కాకుండా సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రకటించారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు, రోడ్డు భద్రతలో గురించి యువతకు భాగస్వామ్యం కల్పించడంలో భాగంగా దేశవ్యాప్తంగా యూత్ వీక్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పై రెండూ కళాశాలలో ట్రాఫిక్ అధికారులు, సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత నియమాలపై వర్క్‌షాప్ నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహనతో పాటుగా లైసెన్స్ పొందడం వంటివి రవాణ , ట్రాఫిక్ ఉన్నతాధికారులు, సిబ్బంది వివరించారు. రోడ్డు భద్రత నియమాలను పాటించకపోవడం వల్ల ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
గ్రామాలలోని ప్రజలకు రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించిని ప్రమాదాలను నివారించాలని కోరారు. ఈ సందర్భంగా హాజరైన వారికి టీ షర్టులు, క్యాప్‌లు పంపిణీ చేశారు. శిక్షణ పొందిన మైభారత్ వాలంటీర్లు ట్రాఫిక్ సిబ్బందికి సహకరిస్తూ వాలంటీర్లుగా సేవలు అందించనున్నారు.
తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిషన్స్ చైర్మన్ టి.మల్లేషం, డైరెక్టర్ డాక్టర్ టి.వరుణ్, ప్రిన్సిపల్ డాక్టర్ జూపల్లి వెంకటేశ్వరరావు, ఎంవీఐ వరంగల్ కే రవీందర్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.వెంకన్న, నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి అన్వేష్ చింతల, ఎన్సీసీ అధ్యాపకులు, ఎన్‌వైకే వాలంటీర్లు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.