వేద న్యూస్, వరంగల్ :
ఓటు ప్రాధాన్యత పై అవగాహన అవసరం అని వరంగల్ జిల్లా స్వీప్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి అభిప్రాయపడ్డారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో గల మెప్మా కార్యాలయం లో తెలుగుతల్లి పట్టణ సమాఖ్య సభ్యులకు ఓటు చైతన్యం పై నిర్వహించిన స్వీప్ -2024(సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ & ఎలక్ట్రల్ పార్టిసిపేషన్) అవగాహన కార్యక్రమానికి నోడల్ అధికారి ముఖ్య అతిధి గా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ లోక్ సభ ఎన్నికల నేపద్యం లో స్వీప్-2024 కార్యక్రమం ద్వారా ఓటు హక్కు వినియోగం పై చైతన్యం కల్పిస్తున్నామని అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి పట్టణ సమాఖ్య ల సహకారం అవసరం అని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు కావాలని ఇందుకోసం సభ్యులు ప్రత్యేక శ్రద్ద వహించాలని, ఓటు నమోదు క్రమం లో అందజేసే ఎపిక్ కార్డ్ గుర్తింపు కార్డ్ గానే కాకుండా వివిధ సంక్షేమ పథకాలను పొందడానికి ఉపయోగ పడుతుందని అన్నారు. జిల్లా వ్యాప్తం గా 18 సంవత్సరాలు నిండిన యువత సుమారు 19 వేల మంది ఉన్నారని, కానీ ఇప్పటి వరకు సుమారు 3 వేల మంది మాత్రమే ఓటరు గా నమోదు చేసుకున్నారని, పూర్తి స్థాయి లో ఓటరు గా నమోదు చేసుకునేలా ప్రోత్సహించి పోలింగ్ శాతం పెంపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.అనంతరం పట్టణ సమాఖ్య సభ్యులచే ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిఆర్ఓ కోలా రాజేష్ కుమార్ గౌడ్, టి ఎం సి రమేష్, యు ఐ బి బ్యాంక్ మేనేజర్ సంజీవ్, సి ఓ లు రజిత, రమా, నాగరాజు, ప్రవీణ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.