వేద న్యూస్, జమ్మికుంట:

ప్రభుత్వ డిగ్రీ కళాశాల జమ్మికుంట ఫ్యాకల్టీ ఫోరం నిర్వహణలో భాగంగా శుక్రవారం ” క్రిటికల్ అనాలసిస్ ఆఫ్ ఎన్ ఈపీ 2020 ది నీడ్ ఫర్ డికోడింగ్” అనే అంశంపై రసాయన శాస్త్ర అధ్యాపకులు ఎడమ శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు.  ఇండిపెండెన్స్  అనంతరం అనేక విద్యా కమిషన్లు ఏర్పడ్డప్పటికీ సమగ్రమైన విద్యా కమిషన్లు మూడు అని అవి.. 1964 ఏర్పాటుచేసిన కొఠారి కమిషన్, 1986 నూతన విద్య విధానం, అలాగే నూతన విద్యా విధానం 2020, నూతన విద్య కమిషన్ 2020 కస్తూరిరంగన్ ఆధ్వర్యంలో ఏర్పడదని ఈ కమిషన్ మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ దాని అమలు ఎలా చేయాలో స్పష్టత కొరవడిందని అన్నారు.

ఈ విధానంలో విద్యార్థి డిగ్రీ అయిపోగానే నేరుగా పరిశోధన చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో ప్రాథమిక విద్య మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండి.. విద్యా లక్ష్యాలు సక్రమంగా నెరవేరుతున్నాయని చెప్పారు.విద్యార్థులను యంత్ర పరికరాలుగా తయారు చేయకుండా వారిలో ఉండే ప్రతిభను గుర్తించి వారి సృజనాత్మకతను వెలికి తీయవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. విద్య ప్రైవేటుపరమైతే మానవ విలువలు నశించిపోతాయని , విద్యా లక్ష్యాలు నెరవేరయని అన్నారు.

ప్రైవేటు రంగంలో ఉన్నప్పటికీ దానిపై నియంత్రణ తప్పనిసరిగా అవసరమని అన్నారు. లేనిపక్షంలో విద్యార్థులు యంత్ర పరికరాలుగా మారి వారిలో సృజనాత్మకత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ డి .రాజశేఖర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా జ్ఞానాన్ని పంచుకోవడం జరుగుతుందని తద్వారా విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు.
తర్వాత విద్యార్థులు,అధ్యాపకులు అడిగిన ప్రశ్నలతో చర్చ కొనసాగింది. సమావేశంలో అధ్యాపకులు డాక్టర్ ఎం రామ్మోహన్ రావు, రేణ ఈశ్వరయ్య, డాక్టర్ బి. సువర్ణ, డాక్టర్ వి. స్వరూపారాణి, మమత, డాక్టర్ పి. సుష్మ, డాక్టర్ ఎంబడి రవి , పి శ్రీనివాస్ రెడ్డి,దేవేందర్ రెడ్డి, ఎల్ రవీందర్ , సుధాకర్ ,అనూష, రమేష్, , ప్రశాంత్, సాయి కుమార్, అరుణ్ వి ద్యార్థులు పాల్గొన్నారు.