వేద న్యూస్, జమ్మికుంట:

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్ బి రమేష్ మాట్లాడుతూ మిల్లెట్స్ వ్యాపారంలో యువతకు అపార అవకాశాలు కలవని తెలిపారు.

ఈ సందర్భంగా స్థానిక మిల్లెట్ స్ వ్యాపార నిర్వహకురాలు శ్రీమతి సుంకిశాల స్వరూప, రాధ..  విద్యార్థులకు ఈ వ్యాపార నిర్వహణలో మెలకువలు తెలిపారు. ఈ మిల్లెట్స్ వ్యాపార నిర్వహణకు ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తుందని విద్యార్థులు తమ డిగ్రీ తర్వాత ఈ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు అని తెలిపారు.

కార్యక్రమంలో వ్యవస్థాపక, అభివృద్ధి విభాగం కన్వీనర్ డాక్టర్ కే రాజేంద్రన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఓ కుమార్, డాక్టర్ కే గణేష్ రాజ్కుమార్, డాక్టర్ రవి, రవీందర్, కిరణ్ కుమార్, ఉమా కిరణ్ మాధవి సాయి రమేష్ ప్రశాంత్ అరుణ్ రాజ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. తదనంతరం స్థానిక చిరుధాన్యాల వ్యాపార నిర్వహకురాలు శ్రీమతి స్వరూప మరియు పద్మలను ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు సన్మానించారు.

అప్రమత్తతే మేలు..  ఎండలతో తస్మాత్ జాగ్రత్త!: డాక్టర్ ఊడుగుల సురేశ్