• ఎల్బీ కాలేజీ ఎన్సిసి క్యాడెట్స్ ఆధ్వర్యంలో..

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
ములుగు రోడ్డులోని లాల్ బహదూర్ కళాశాలలోఎన్సిసి ఆర్మీ పదో తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ ఇయర్ మినరల్స్ సంవత్సరంగా 2023-24’ను ప్రకటించిన సందర్భంగా ప్రతిజ్ఞ చేయించడంతో పాటు భారీ ర్యాలీని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ రావు అధ్యక్షతన నిర్వహించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆర్మీ ఆఫీసర్ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ సందీప్ పడో తెలంగాణ బెటాలియన్ ఎన్సిసి వారు సంయుక్తంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యవంతమైన సమాజం తయారు కావడానికి అంతర్జాతీయ మినరల్స్ సంవత్సరంగా 2023 -24 ను ప్రకటించిన విషయాన్ని విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని సందీప్ తెలిపారు.

ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఆహార దినుసులను వాడటం వల్ల మనం ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా ఎక్కువ సంవత్సరాలు బతకవచ్చని చెప్పారు. ఈ నెల 9 నుంచి 14 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ‘ప్రపంచ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్’ డే గురించి..మినరల్స్, వాటి ప్రాధాన్యత గురించి అవగాహన కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

విద్యార్థులలో చైతన్యం నింపే విధంగా పోటీలు నిర్వహించి వాటి ఉపయోగాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్య సూత్రాలు మినరల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు చెప్పారు. అరుదైన రాగి, జావా, జొన్నలు, మినుములు దేశీయ సంప్రదాయ దినుసులు..మన పంటల ద్వారా వచ్చే ఈ మినరల్స్ వాడడం వల్ల కరోనా లాంటి మహమ్మారిని కూడా తట్టుకోగలిగామని వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ విషయం ఈ ‘మినరల్స్ డే’ లో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

 

ఎన్సిసి పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అజయ్ నందకండురి సూచన మేరకు నిర్వహించినట్లు పిల్లలకు స్వతహాగా వంట చేయడం, వాటిలో వంటలో ఉపయోగించే వివిధ పద్ధతులను కూడా ఇందులో భాగంగానే ప్రయోగాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. ఈ విషయమై వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు, మినరల్స్ పై చిత్రలేఖనం పోటీలు కండక్ట్ చేసినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు.

మినరల్స్ గురించి విస్తృత ఉపన్యాసకుడు వి మధుకర్ రావు విద్యార్థులకు వాటి ప్రాధాన్యత, బి విటమిన్ డి, సి, బి 11, బి 12 గురించి విస్తృత ఉపన్యాసం చేశారు. కార్యక్రమంలో కళాశాల ఎన్సిసి ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఎం సదానందం, ఆర్మీ జూనియర్ కమిషనర్ ఆఫీసర్ హవల్దార్ సందీప్, వి మధుకర్ రావు, ఓం శ్రీ, నేహ శ్రీ, పవన్, రాధిక, భరత్, జూనియర్ అండ్ ఆఫీసర్ సంతోషి, సృజన ,శృతి, రజినీకాంత్ , భాస్కర్, వర్షిని, భాగ్యలక్ష్మి, వినీత,, విద్య, సుప్రియ, జగదీష్ ఎన్సిసి క్యాడెట్స్ పాల్గొన్నారు.