వేద న్యూస్, వరంగల్ :
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో సి ఎ భగవాన్ దాస్ ముందడ అధ్యక్షతన బ్యాంక్ ఆడిట్ పై అవగహన సదస్సును హంటర్ రోడ్ నందు గల ఐసిఏఐ వరంగల్ బ్రాంచ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తులుగా సిఎ తోటపల్లి విజయ్ , సీఏ వేణు గోపాల్ హాజరై బ్యాంక్ ఆడిట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్లుప్తంగా వివరించారు. భారతదేశంలోని ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా దృఢంగా, సమగ్రంగా ఉందని అందువల్లని భారత దేశంలోని బ్యాంకులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పనిచేస్తున్నాయని అన్నారు .టెక్నాలజీ ఉపయోగించుకొని ఆడిట్ చేయడం వల్ల చాలా త్వరగ ఆడిట్ చేయవచ్చునని తెలిపారు.అనంతరం ఐసిఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ సీఏ భగవాన్ దాస్ ముందడ మాట్లాడుతూ భారతదేశంలోని సిఏలు అంతా కూడా వారి యొక్క ఆడిట్ నిర్వహణను చాలా బాధ్యతగా చేస్తున్నారని వారి యొక్క పనితీరు ఇతర నిఘా సంఘలకు ఆదర్శనీయంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ చైర్మన్ సీఏ. భగవాన్ దాస్ ముందడ,కార్యదర్శి సీ ఏ మాదారపు సుజిత్, మాజీ చైర్మన్ రాయబారపు హరికృష్ణ , సీఏ లు తోట కరుణాకర్, చంచల్ అగర్వాల్ , రాజేష్ బజాజ్, వంశీ కృష్ణా , పరమేష్ , భరత్ , సాయి బిందు , సీఏ విద్యార్థులు పాల్గొన్నారు.