- టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్
- ఉచిత కుట్టుమిషన్ శిక్షణా తరగతులు ప్రారంభం
వేద న్యూస్, జమ్మికుంట:
బాల వికాస సంస్థ చేపడుతోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్(టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) అన్నారు. అందరు బాల వికాస సంస్థ ను ఆదరిస్తూ..అండగా ఉండాలని ఆయన కోరారు. బాలవికాస ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ తరగతులను జమ్మికుంటలో ప్రభు మంగళవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. బాలవికాస సభ్యులలో కుట్టు మిషన్ వచ్చిన వారిలో ప్రత్యేక శిక్షణ ద్వారా మరిన్ని మెళకువలు నేర్పడం కోసం ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాలలో బాలవికాస సంస్థ సభ్యురాళ్లకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 15 మంది మహిళలకు కుట్టు మిషన్ వచ్చిన వారిని ఎంపిక చేశారు. 42 వేల రూపాయల విలువ చేసే కుట్టు మిషన్ ఒక్కొక్క సభ్యురాలు 15 వేల రూపాయలు బాల వికాస సంస్థ ద్వారా చెల్లిస్తే..మిగతా 27 వేల రూపాయలు ఉషా కంపెనీ సహకారంతో లబ్ధిదారులకు అందజేసి శిక్షణను ప్రారంభించారు. ఈ శిక్షణ 21 రోజుల పాటు ఉంటుందని బాల వికాస సంస్థ ఫీల్డ్ కో-ఆర్డినేటర్ అమూల్య తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభు మాట్లాడుతూ కుట్టుమిషన్ నేర్చుకునే ‘బాల వికాస’ సంస్థ సభ్యులందరూ ఉచిత శిక్షణను వినియోగించుకుని..నేటి సమాజానికి అనుగుణంగా మెళకువలు నేర్చుకుని ఆర్థిక అభివృద్ధి చెందుతూ..సమాజంలో ఆదర్శంగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో బాల వికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, లావణ్య తదితరులు పాల్గొన్నారు.